యెహేజ్కేలు 26:4

వారు వచ్చి తూరుయొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు, నేను దానిమీదనున్న మంటిని తుడిచి వేయుదును, దానిని వట్టిబండగా చేసెదను.

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 26

2నరపుత్రుడా, యెరూష లేమునుగూర్చిఆహా జనములకు ద్వారముగానున్న పట్ట ణము పడగొట్టబడెను, అది నావశమాయెను, అది పాడై పోయినందున నేను పరిపూర్ణము నొందితిని అని తూరు చెప్పెను గనుక

3ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగాతూరుపట్టణమా, నేను నీకు విరోధి నైతిని, సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేకజనములను నీ మీదికి రప్పించెదను.

4వారు వచ్చి తూరుయొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు, నేను దానిమీదనున్న మంటిని తుడిచి వేయుదును, దానిని వట్టిబండగా చేసెదను.

5​సముద్రము దాని నావరించును, అది వలలు పరచుటకు చోటగును, నేనేమాట యిచ్చితిని, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అది జనములకు దోపుడుసొమ్మగును.

6బయటి పొలములో నున్న దాని కుమార్తెలు కత్తిపాలగుదురు, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

యెహేజ్కేలు 26 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी