1 రాజులు 12:11

నా తండ్రి మీమీద బరువైన కాడిని పెట్టెను సరే, నేను ఆ కాడిని ఇంక బరువుగా చేయుదును; నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెనుసరే, నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును.

సందర్భంతో చదవండి · 1 రాజులు 12

9మామీద నీ తండ్రి యుంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనిన యీ జనులకు ప్రత్యుత్తరమిచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు?

10అప్పుడు అతనితో కూడ ఎదిగిన ఆ ¸°వనస్థులు ఈ ఆలోచన చెప్పిరినీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను గాని నీవు దానిని చులకనగా చేయవలెనని నీతో చెప్పుకొనిన యీ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇమ్మునా తండ్రి నడుముకంటె నా చిటికెన వ్రేలు పెద్దదిగా ఉండును.

11నా తండ్రి మీమీద బరువైన కాడిని పెట్టెను సరే, నేను ఆ కాడిని ఇంక బరువుగా చేయుదును; నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెనుసరే, నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును.

12మూడవ దినమందు నాయొద్దకు రండని రాజు నిర్ణయము చేసియున్నట్లు యరొబామును జనులందరును మూడవ దినమున రెహబాము నొద్దకు వచ్చిరి.

13​అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి ¸°వనులు చెప్పిన ఆలోచనచొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి యిట్లు ఆజ్ఞాపించెను

1 రాజులు 12 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी