అతడు మిక్కిలి గొప్పవాడగువరకు క్రమ క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను.
11అబీమెలెకుఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్లు వాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజల కందరికి ఆజ్ఞాపింపగా
12ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను.
13అతడు మిక్కిలి గొప్పవాడగువరకు క్రమ క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను.
14అతనికి గొఱ్ఱల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహ మును కలిగినందున ఫిలిష్తీయులు అతనియందు అసూయ పడిరి.
15అతని తండ్రియైన అబ్రాహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి