ఆ యా గుమ్మముల వాకిండ్లు కొలువగా వాటి వెడల్పు పది మూర లును నిడివి పదుమూడు మూరలును తేలెను.
9గుమ్మపు ద్వారము కొలువగా అది యెనిమిది మూరలై యుండెను, దానిస్తంభములు రెండేసి మూరలు; అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను.
10తూర్పు గుమ్మపు ద్వారముయొక్క కావలి గదులు ఇటు మూడును, అటు మూడును ఉండెను, మూడు గదులకు కొలత యొకటే. మరియు రెండు ప్రక్కలనున్న స్తంభములకు కొలత యొకటే.
11ఆ యా గుమ్మముల వాకిండ్లు కొలువగా వాటి వెడల్పు పది మూర లును నిడివి పదుమూడు మూరలును తేలెను.
12కావలి గదులముందర మూరెడు ఎత్తుగల గోడ ఇరుప్రక్కల నుండెను, ఆ ప్రక్కను ఈ ప్రక్కను మూరెడు ఎత్తుగల గోడ యుండెను; గదులైతే ఇరుప్రక్కలను ఆరుమూరల ఎత్తుగలవి.
13ఒకగది కప్పునుండి రెండవదాని కప్పువరకు గుమ్మమును కొలువగా ఇరువది యయిదు మూరల వెడల్పు తేలెను, రెండు వాకిండ్లమధ్య గోడను అదే కొలత.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి