యెహేజ్కేలు 40:14

అరువదేసి మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలువబెట్టబడెను. గుమ్మము చుట్టునున్న ఆవరణము స్తంభ ములవరకు వ్యాపించెను.

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 40

12కావలి గదులముందర మూరెడు ఎత్తుగల గోడ ఇరుప్రక్కల నుండెను, ఆ ప్రక్కను ఈ ప్రక్కను మూరెడు ఎత్తుగల గోడ యుండెను; గదులైతే ఇరుప్రక్కలను ఆరుమూరల ఎత్తుగలవి.

13ఒకగది కప్పునుండి రెండవదాని కప్పువరకు గుమ్మమును కొలువగా ఇరువది యయిదు మూరల వెడల్పు తేలెను, రెండు వాకిండ్లమధ్య గోడను అదే కొలత.

14అరువదేసి మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలువబెట్టబడెను. గుమ్మము చుట్టునున్న ఆవరణము స్తంభ ములవరకు వ్యాపించెను.

15బయటి గుమ్మమునొద్దనుండి లోపటి గుమ్మపుద్వారమువరకు ఏబదిమూరలు.

16కావలి గదులకును గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టు నున్న గోడలకును ప్రక్కగదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను, గోడలోని స్తంభములకును కిటికీలుండెను; ప్రతి స్తంభముమీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి యుండెను.

యెహేజ్కేలు 40 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी