తొలిచూలిని అగ్నిగుండముదాటించి బలి దానముల నిచ్చుటచేత తమ్మును తాము అపవిత్రపరచు కొననిచ్చితిని.
24తమ పితరులు పెట్టుకొనిన విగ్రహములను పూజింప గోరగా, అన్యజనులలో వారిని చెదరగొట్టి సకలదేశముల లోనికి వారిని వెళ్లగొట్టుదునని ప్రమాణము చేసితిని.
25నేను యెహోవానని వారు తెలిసికొనునట్లు వారిని విస్మ యము నొందింపవలెనని అనుకూలము కాని కట్టడలను తాము బ్రదుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికిచ్చితిని.
26తొలిచూలిని అగ్నిగుండముదాటించి బలి దానముల నిచ్చుటచేత తమ్మును తాము అపవిత్రపరచు కొననిచ్చితిని.
27కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులతో మాట లాడి ఇట్లు ప్రకటింపుముప్రభువగు యెహోవా సెల విచ్చునదేమనగా మీ పితరులు నాయెడల అతిక్రమముచేసి నన్ను దూషించి
28వారికిచ్చెదనని నేను ప్రమాణ పూర్వక ముగా చెప్పిన దేశములోనికి నేను వారిని రప్పించిన తరు వాత, ఎత్తయిన యొక కొండనేగాని, దట్టమైన యొక వృక్షమునేగాని తాము చూచినప్పుడెల్లను బలులు అర్పిం చుచు, అర్పణలను అర్పించుచు, అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించుచు, పానార్పణములు చేయుచు నాకు కోపము పుట్టించిరి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి