మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయిలను తీయకయే పాళెము వెలుపలికి వారిని మోసికొని పోయిరి.
3అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెనుఇది యెహోవా చెప్పిన మాటనాయొద్దనుండు వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచు కొందును; ప్రజలందరియెదుట నన్ను మహిమపరచు కొందును;
4అహరోను మౌనముగానుండగా మోషే అహరోను పిన తండ్రియైన ఉజ్జీయేలు కుమారులైన మీషా యేలును ఎల్సాఫానును పిలిపించిమీరు సమీపించి పరి శుద్ధ స్థలము నెదుటనుండి పాళెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసికొని పోవుడని వారితో చెప్పెను.
5మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయిలను తీయకయే పాళెము వెలుపలికి వారిని మోసికొని పోయిరి.
6అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియా జరు ఈతామారును వారితోమీరు చావకుండునట్లును యెహోవా ఈ సర్వసమాజముమీద ఆగ్రహపడకుండు నట్లును, మీరు తల విరియబోసికొనకూడదు; బట్టలను చింపుకొనకూడదు కాని, యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరు లైన ఇశ్రాయేలీయుల యింటివారందరు ఏడవ వచ్చును.
7యెహోవా అభిషేకతైలము మీ మీద నున్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారములోనుండి బయలు వెళ్ల కూడ దనెను. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి