2 రాజులు 9:15

​అయితే యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుచుండగా సిరియనులవలన తాను పొందిన గాయములను బాగు చేసి కొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి వచ్చియుండెను. అంతట యెహూనీకనుకూలమైతే ఈ సంగతి తెలియ బడకుండునట్లు ఈ పట్టణములోనుండి యెవనినైనను యెజ్రెయేలు ఊరికి తప్పించుకొని పోనియ్యకుమని ఆజ్ఞ ఇచ్చి

సందర్భంతో చదవండి · 2 రాజులు 9

13అంతట వారు అతివేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్లమీద అతని క్రింద పరచి బాకా ఊదించియెహూ రాజైయున్నాడని చాటించిరి.

14ఈ ప్రకారము నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ యెహోరాముమీద కుట్రచేసెను. అప్పుడు యెహోరామును ఇశ్రాయేలువారందరును సిరియా రాజైన హజాయేలును ఎదిరించుటకై రామో త్గిలాదు దగ్గర కావలి యుండిరి.

15​అయితే యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుచుండగా సిరియనులవలన తాను పొందిన గాయములను బాగు చేసి కొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి వచ్చియుండెను. అంతట యెహూనీకనుకూలమైతే ఈ సంగతి తెలియ బడకుండునట్లు ఈ పట్టణములోనుండి యెవనినైనను యెజ్రెయేలు ఊరికి తప్పించుకొని పోనియ్యకుమని ఆజ్ఞ ఇచ్చి

16​​రథముయెక్కి, యెజ్రెయేలు ఊరిలో యెహో రాము మంచము పట్టియుండగా అచ్చటికి పోయెను మరియు యూదా రాజైన అహజ్యా యెహోరామును దర్శించుటకై అచ్చటికి వచ్చి యుండెను.

17​యెజ్రెయేలు గోపురముమీద కావలివాడు నిలిచి యుండి, యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచిసైన్యమొకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యెహోరాము ఒక రౌతును పిలిచివారిని ఎదుర్కొనబోయిసమా ధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి, పంపుమని వానితో సెలవిచ్చెను.

2 రాజులు 9 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी