యెషయా 30:11

అడ్డము రాకుండుడి త్రోవనుండి తొలగుడి ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని సంగతి మా యెదుట ఎత్తకుడి అని భవిష్యద్‌ జ్ఞానులతో పలుకువారునై యున్నారు.

సందర్భంతో చదవండి · యెషయా 30

9వారు తిరుగబడు జనులు అబద్ధమాడు పిల్లలు యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు

10దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పు వారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి మృదువైన మాటలనే మాతో పలుకుడి మాయాదర్శనములను కనుడి

11అడ్డము రాకుండుడి త్రోవనుండి తొలగుడి ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని సంగతి మా యెదుట ఎత్తకుడి అని భవిష్యద్‌ జ్ఞానులతో పలుకువారునై యున్నారు.

12అందుచేతను ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు ఈ వాక్యమువద్దని త్రోసివేసి బలాత్కార మును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసికొంటిరి గనుక

13ఈ దోషము మీకు ఎత్తయిన గోడ నుండి జోగిపడబోవుచున్న గోడ అండవలె అగును అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును.

యెషయా 30 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी