యెహేజ్కేలు 21:21

బాటలు చీలుచోట రెండు మార్గములు చీలు స్థలమున శకునము తెలిసికొను టకు బబులోను రాజు నిలుచుచున్నాడు; అతడు బాణ ములను ఇటు అటు ఆడించుచు, విగ్రహములచేత విచారణ చేయుచు, కార్యమునుబట్టి శకునము చూచుచున్నాడు.

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 21

19నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గమువచ్చుటకు రెండు మార్గములను ఏర్పర చుము. ఆరెండును ఒక దేశములోనుండి వచ్చునట్లు సూచించుటకై యొక హస్తరూపము గీయుము, పట్టణపు వీధి కొనను దాని గీయుము.

20ఖడ్గమునకు అమ్మోనీయుల పట్టణమగు రబ్బాకు ఒక మార్గమును, యూదాదేశమం దున్న ప్రాకారములు గల పట్టణమగు యెరూషలేమునకు ఒక మార్గమును ఏర్పరచుము.

21బాటలు చీలుచోట రెండు మార్గములు చీలు స్థలమున శకునము తెలిసికొను టకు బబులోను రాజు నిలుచుచున్నాడు; అతడు బాణ ములను ఇటు అటు ఆడించుచు, విగ్రహములచేత విచారణ చేయుచు, కార్యమునుబట్టి శకునము చూచుచున్నాడు.

22యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్ర ములు పెట్టుమనియు, హతముచేయుదమనియు, ధ్వని ఎత్తుమనియు, జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు, గుమ్మ ములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచు మనియు, దిబ్బలు వేయుమనియు, ముట్టడి దిబ్బలు కట్టు మనియు యెరూషలేమునుగూర్చి తన కుడితట్టున శకునము కనబడెను.

23ప్రమాణములు చేసికొనిన వారికి ఈ శకు నము వ్యర్థముగా కనబడును; అయితే వారు పట్టబడునట్లు వారు చేసికొనిన పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించును.

యెహేజ్కేలు 21 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी