ప్రభువు సముఖము నుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును
17సహోదరులారా, మీరును మీ అధికారులును తెలియక చేసితిరని నాకు తెలియును.
18అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తలనోట ముందుగా ప్రచురపరచిన విషయ ములను ఈలాగు నెరవేర్చెను.
19ప్రభువు సముఖము నుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును
20మీకొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి.
21అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసియై యుండుట ఆవశ్యకము.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి