యెహేజ్కేలు 7:19

తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని యెంచుదురు, యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించ జాలదు, అది వారి దోషక్రియలు విడువకుండ అభ్యంతరమాయెను గనుక దానివలన వారు తమ ఆకలి తీర్చుకొనజాలకపోదురు, తమ ఉదరమును పోషించుకొనజాలకపోదురు.

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 7

17​అందరిచేతులు సత్తువ తప్పును, అందరి మోకాళ్లు నీళ్లవలె తత్తరిల్లును.

18వారు గోనెపట్టకట్టు కొందురు, వారికి ఘోరమైన భయము తగులును, అందరు సిగ్గుపడుదురు, అందరి తలలు బోడియగును.

19తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని యెంచుదురు, యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించ జాలదు, అది వారి దోషక్రియలు విడువకుండ అభ్యంతరమాయెను గనుక దానివలన వారు తమ ఆకలి తీర్చుకొనజాలకపోదురు, తమ ఉదరమును పోషించుకొనజాలకపోదురు.

20శృంగార మైన ఆ యాభరణమును వారు తమ గర్వమునకు ఆధార ముగా ఉపయోగించిరి, దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి గనుక నేను దానిని వారికి రోతగా చేసెదను,

21వారు దాని అపవిత్రపరచునట్లు అన్యులచేతికి దోపుడు సొమ్ముగాను దుర్మార్గులైన జనులకు లూటిగాను నేను దానిని అప్పగించెదను.

యెహేజ్కేలు 7 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी