1 దినవృత్తాంతములు 21:19

యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్లెను.

సందర్భంతో చదవండి · 1 దినవృత్తాంతములు 21

17దావీదుజనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చినవాడను నేనేగదా? పాపము చేసి చెడుతనము జరిగించినవాడను నేనేగదా? గొఱ్ఱలవంటివారగు వీరేమి చేసిరి? నా దేవుడవైన యెహోవా, బాధపెట్టు నీ చెయ్యి నీ జనులమీద నుండ కుండ నామీదను నా తండ్రి యింటివారిమీదను ఉండ నిమ్మని దేవునితో మనవిచేసెను.

18యెబూసీయుడైన ఒర్నాను కళ్లమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్లవలెనని దావీదునకు ఆజ్ఞ నిమ్మని యెహోవా దూత గాదునకు సెలవియ్యగా

19యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్లెను.

20ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చు చుండెను; అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు, అతడును అతనితో కూడనున్న అతని నలుగురు కుమారు లును దాగుకొనిరి.

21దావీదు ఒర్నానునొద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి, కళ్లములోనుండి వెలుపలికి వచ్చి, తల నేల మట్టునకు వంచి దావీదుకు నమస్కారము చేసెను.

1 దినవృత్తాంతములు 21 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी