యూదావారిలో డాలును ఈటెను పట్టుకొని యుద్ధసన్నద్ధులై యున్నవారు ఆరువేల ఎనిమిదివందలమంది.
22దావీదు దండు దేవుని సైన్యమువలె మహాసైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయము చేయువారు అతనియొద్దకు వచ్చు చుండిరి.
23యెహోవా నోటిమాట ప్రకారము సౌలుయొక్క రాజ్యమును దావీదుతట్టు త్రిప్పవలెనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతనియొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క యెంతయనగా
24యూదావారిలో డాలును ఈటెను పట్టుకొని యుద్ధసన్నద్ధులై యున్నవారు ఆరువేల ఎనిమిదివందలమంది.
25షిమ్యోనీయులలో యుద్ధ మునకు తగినశూరులు ఏడువేల నూరుమంది.
26లేవీయులలో అట్టివారు నాలుగువేల ఆరువందలమంది.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి