మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి.
14మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగముచేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించినయెడల మీకు క్షేమము కలుగును.
15అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసినయెడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధ ముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును.
16మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి.
17గోధుమ కోతకాలము ఇదే గదా? మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలిసికొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను.
18సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరు యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి