2 రాజులు 1:7

మిమ్మును ఎదుర్కొనవచ్చి యీ మాట చెప్పినవాడు ఏలాటివాడని రాజు అడిగెను.

సందర్భంతో చదవండి · 2 రాజులు 1

5తరు వాత ఆ దూతలు రాజునొద్దకు వచ్చిరి.మీరెందుకు తిరిగి వచ్చితిరని అతడు వారి నడుగగా

6వారుఒక మనుష్యుడు మాకు ఎదురుపడిమిమ్మును పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియ జేయుడియెహోవా సెలవిచ్చునదేమనగాఇశ్రాయేలులో దేవు డన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జె బూబునొద్ద విచారణచేయుటకు నీవు దూతలను పంపు చున్నావే; నీవెక్కిన మంచముమీద నుండి దిగి రాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని అతడు పలికెనని వారు చెప్పగా

7మిమ్మును ఎదుర్కొనవచ్చి యీ మాట చెప్పినవాడు ఏలాటివాడని రాజు అడిగెను.

8అందుకు వారు అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొనినవాడని ప్రత్యుత్తరమియ్యగాఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలీయా అని అతడు చెప్పెను.

9వెంటనే రాజు ఏబదిమందికి అధిపతియైన యొకనిని వాని యేబదిమందితో కూడ ఏలీయా యొద్దకు పంపెను. అతడు కొండమీద కూర్బుని యుండగా అధిపతి యెక్కి అతని సమీపమునకు పోయిదైవజనుడా, నీవు దిగిరావలెనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను.

2 రాజులు 1 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी