అపో. కార్యములు 5:24

అంతట దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులును ఆ మాటలు వినిఇది యేమవునో అని వారి విషయమై యెటుతోచక యుండిరి.

సందర్భంతో చదవండి · అపో. కార్యములు 5

22బంట్రౌతులు అక్కడికి వెళ్లినప్పుడు వారు చెర సాలలో కనబడనందున తిరిగివచ్చి

23చెరసాల బహు భద్రముగా మూసియుండుటయు, కావలివారు తలుపుల ముందర నిలిచియుండుటయు చూచితివిు గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి.

24అంతట దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులును ఆ మాటలు వినిఇది యేమవునో అని వారి విషయమై యెటుతోచక యుండిరి.

25అప్పుడు ఒకడు వచ్చిఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా

26అధిపతి బంట్రౌతులతో కూడ పోయి, ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి, బలాత్కారము చేయకయే వారిని తీసికొని వచ్చెను.

అపో. కార్యములు 5 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी