ద్వితియోపదేశకాండము 14:25

నీ దేవుడైన యెహోవా యేర్పరచుకొను స్థలము నకు వెళ్లి నీవు కోరు దేనికైనను

సందర్భంతో చదవండి · ద్వితియోపదేశకాండము 14

23నీ దినము లన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనునట్లు నీ దేవుడైన యెహోవా తన నామము నకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలోగాని నీ ద్రాక్షారసములోగాని నీ నూనెలోగాని పదియవ పంతును, నీ పశువులలోగాని గొఱ్ఱ మేకలలోగాని తొలిచూలు వాటిని తినవలెను.

24మార్గము దీర్ఘముగానున్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలము మిక్కిలి దూరముగా నున్నందున, నీవు వాటిని మోయ లేనియెడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించు నప్పుడు, వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని,

25నీ దేవుడైన యెహోవా యేర్పరచుకొను స్థలము నకు వెళ్లి నీవు కోరు దేనికైనను

26ఎద్దులకేమి గొఱ్ఱల కేమి ద్రాక్షారసమునకేమి మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండి నిచ్చి, అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనముచేసి, నీవును నీ యింటివారును నీ యింటనుండు లేవీయులును సంతోషింపవలెను.

27లేవీ యులను విడువ కూడదు; నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు.

ద్వితియోపదేశకాండము 14 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी