ఎజ్రా 4:17

అప్పుడు రాజుమంత్రియగు రెహూమునకును లేఖకుడగు షివ్షుయికిని షోమ్రోనులో నివసించువారి పక్షముగానున్న మిగిలిన వారికిని నది యవ తలనుండు తక్కినవారికినిమీకు క్షేమసంప్రాప్తియగును గాక అని యీ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చిన దేమనగా

సందర్భంతో చదవండి · ఎజ్రా 4

15మరియు తమ పూర్వికులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచినయెడల, ఈ పట్టణపువారు తిరుగుబాటు చేయువారుగాను, రాజులకును దేశములకును హాని చేయువారుగాను, కలహకారులుగాను కనబడుదు రనియు, అందువలననే యీ పట్టణము నాశనము పొందె ననియు రాజ్యపు దస్తావేజులవలననే తమకు తెలియ వచ్చును.

16​కావున రాజవైన తమకు మేము రూఢిపరచున దేమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలువబెట్టబడినయెడల నది యివతల తమకు హక్కు ఎంత మాత్రము ఉండదు.

17అప్పుడు రాజుమంత్రియగు రెహూమునకును లేఖకుడగు షివ్షుయికిని షోమ్రోనులో నివసించువారి పక్షముగానున్న మిగిలిన వారికిని నది యవ తలనుండు తక్కినవారికినిమీకు క్షేమసంప్రాప్తియగును గాక అని యీ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చిన దేమనగా

18మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకొన్నాము.

19అందువిషయమై మా యాజ్ఞను బట్టి వెదకగా, ఆదినుండి ఆ పట్టణపువారు రాజులమీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపడి నది.

ఎజ్రా 4 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी