పిమ్మట యెహోషాపాతునేడు యెహోవా యొద్ద విచారణచేయుదము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా
3ఇశ్రాయేలురాజు తన సేవకులను పిలిపించిరామోత్గిలాదు మనదని మీరెరుగుదురు; అయితే మనము సిరియా రాజు చేతిలోనుండి దాని తీసికొనక ఊరకున్నామని చెప్పి
4యుద్ధము చేయుటకు నాతోకూడ నీవు రామోత్గిలాదునకు వచ్చెదవా అని యెహోషాపాతును అడిగెను. అందుకు యెహోషాపాతునేను నీవాడనే; నా జనులు నీ జనులే నా గుఱ్ఱములును నీ గుఱ్ఱములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పెను.
5పిమ్మట యెహోషాపాతునేడు యెహోవా యొద్ద విచారణచేయుదము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా
6ఇశ్రాయేలురాజు దాదాపు నాలుగు వందలమంది ప్రవక్తలను పిలిపించియుద్ధము చేయుటకు రామోత్గిలాదుమీదికి పోదునా పోకుందునా అని వారి నడిగెను. అందుకుయెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక
7పొండని వారు చెప్పిరి గాని యెహోషాపాతువిచారణ చేయుటకై వీరు తప్పయెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి