2 సమూయేలు 13:29

అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞచొప్పునవారు చేయగా రాజకుమారులందరును లేచి తమ కంచరగాడిదల నెక్కి పారిపోయిరి.

సందర్భంతో చదవండి · 2 సమూయేలు 13

27​అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరును అతని యొద్దకు పోవచ్చు నని సెలవిచ్చెను.

28అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసమువలన సంతోషియై యుండుట మీరు కనిపెట్టియుండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పు నప్పుడు భయపడక అతని చంపుడి, నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చి యున్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెను.

29అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞచొప్పునవారు చేయగా రాజకుమారులందరును లేచి తమ కంచరగాడిదల నెక్కి పారిపోయిరి.

30వారు మార్గములో ఉండగానే యొకడును లేకుండ రాజకుమారులను అందరిని అబ్షాలోము హతముచేసెనని దావీదునకు వార్త రాగా

31అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడియుండెను; మరియు అతని సేవకులందరు వస్త్రములు చింపుకొని దగ్గర నిలువబడియుండిరి.

2 సమూయేలు 13 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी