యెహోషువ 18:7

​లేవీయు లకు మీ మధ్య ఏ వంతును కలుగదు, యెహోవాకు యాజక ధర్మము చేయుటే వారికి స్వాస్థ్యము. గాదీయు లును రూబేనీయులును మనష్షే అర్ధగోత్రపువారును యొర్దాను అవతల తూర్పుదిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చిన స్వాస్థ్యములను పొందియున్నారు.

సందర్భంతో చదవండి · యెహోషువ 18

5వారు ఏడువంతులుగా దాని పంచుకొందురు. యూదా వంశస్థులు దక్షిణదిక్కున తమ సరిహద్దులోపల నిలిచి యుండవలెను. యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దులోపల నిలిచి యుండవలెను.

6మీరు ఏడు వంతులుగా దేశవివరమును వ్రాసి నా యొద్దకు తీసికొని రావలెను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతుచీట్లు వేసెదను.

7​లేవీయు లకు మీ మధ్య ఏ వంతును కలుగదు, యెహోవాకు యాజక ధర్మము చేయుటే వారికి స్వాస్థ్యము. గాదీయు లును రూబేనీయులును మనష్షే అర్ధగోత్రపువారును యొర్దాను అవతల తూర్పుదిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చిన స్వాస్థ్యములను పొందియున్నారు.

8ఆ మనుష్యులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును వ్రాయుటకు వెళ్లబోవు వారితోమీరు ఆ దేశములో బడి నడుచుచు దాని వివరమును వ్రాసి నాయొద్దకు తిరిగి రండి; అప్పుడు నేను షిలోహులో మీకొరకు యెహోవా సన్నిధిని వంతుచీట్లు వేయించెద ననగా

9ఆ మనుష్యులు వెళ్లి దేశసంచారము చేయుచు ఏడువంతులుగా, గ్రామములచొప్పున, దాని వివరమును పుస్తకములో వ్రాసి షిలోహులోని పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చిరి.

యెహోషువ 18 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी