యోబు 42:7

యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెల విచ్చెను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుకనా కోపము నీమీదను నీ ఇద్దరు స్నేహితులమీదనుమండుచున్నది

సందర్భంతో చదవండి · యోబు 42

5వినికిడిచేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచు చున్నాను.

6కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.

7యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెల విచ్చెను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుకనా కోపము నీమీదను నీ ఇద్దరు స్నేహితులమీదనుమండుచున్నది

8కాబట్టి యేడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసికొని, నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైనయోబు మీ నిమిత్తము ప్రార్థనచేయును. మీ అవివేకమునుబట్టి మిమ్మును శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను; ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్నుగూర్చి యుక్తమైనది పలుక లేదు.

9తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి, యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారిపక్షమున యోబును అంగీకరించెను.

యోబు 42 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी