ఆ మేఘము బహుదినములు మందిరముమీద నిలిచినయెడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిననుసరించి ప్రయా ణము చేయకుండిరి.
17ఆ మేఘము గుడారము మీదనుండి పైకెత్తబడునప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయా ణమైసాగిరి; ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసికొనిరి.
18యెహోవానోటిమాటచొప్పున ఇశ్రాయేలీయులు ప్రయా ణమైసాగిరి. యెహోవా నోటిమాటచొప్పున వారు తమ గుడారములను వేసికొనిరి. ఆ మేఘము మందిరముమీద నిలిచియుండిన దినములన్నియు వారు నిలిచిరి.
19ఆ మేఘము బహుదినములు మందిరముమీద నిలిచినయెడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిననుసరించి ప్రయా ణము చేయకుండిరి.
20మేఘము కొన్ని దినములు మంది రము మీద నిలిచినయెడల వారును నిలిచిరి; యెహోవా నోటిమాట చొప్పుననే నిలిచిరి, యెహోవా నోటిమాట చొప్పుననే ప్రయాణము చేసిరి.
21ఆలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు నిలిచిన యెడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడ గానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రియేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి