యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు.
1యెహోవా తన్ను సౌలుచేతిలోనుండియు, తనశత్రువులందరి చేతిలోనుండియు తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పియెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను.
2యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు.
3నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును.నా కేడెము నా రక్షణశృంగమునా ఉన్నతదుర్గము నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడుబలాత్కారులనుండి నన్ను రక్షించువాడవు నీవే.
4కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱ పెట్టితిని నా శత్రువుల చేతిలోనుండి ఆయన నన్ను రక్షించెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి