జనులుఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదని కేకలు వేసిరి.
20తూరీయులమీదను సీదోనీయులమీదను అతనికి అత్యా గ్రహము కలిగినందున వారేకమనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పైవిచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసికొని సమాధాన పడవలెనని వేడుకొనిరి; ఎందుకనగా రాజుయొక్క దేశమునుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను.
21నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి యెదుట ఉపన్యాసముచేయగా
22జనులుఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదని కేకలు వేసిరి.
23అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను.
24దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి