ప్రభువైన యెహోవా సెల విచ్చునదేమనగాఇదిగో నేను నేనే నా గొఱ్ఱలను వెదకి వాటిని కనుగొందును.
9కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి.
10ప్రభు వైన యెహోవా సెలవిచ్చునదేమనగానా జీవముతోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని, నా గొఱ్ఱలనుగూర్చి వారియొద్ద విచారించెదను, వారు గొఱ్ఱలు మేపుట మాన్పించెదను, ఇకను కాపరులు తమ కడుపు నింపుకొన జాలక యుందురు; నా గొఱ్ఱలు వారికి తిండికాకుండ వారి నోటనుండి వాటిని తప్పించెదను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
11ప్రభువైన యెహోవా సెల విచ్చునదేమనగాఇదిగో నేను నేనే నా గొఱ్ఱలను వెదకి వాటిని కనుగొందును.
12తమ గొఱ్ఱలు చెదరిపోయి నప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొఱ్ఱ లను వెదకి, చీకటిగల మబ్బుదినమందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయెనో అక్కడనుండి నేను వాటిని తప్పించి
13ఆ యా జనులలోనుండి వాటిని తోడుకొని వచ్చి, ఆ యా దేశములలోనుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశము లోనికి వాటిని తెచ్చి పర్వతములమీదను వాగులయొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి