అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను; ప్రవక్త యెరూషలేము నకు వెలుపల నశింప వల్లపడదు.
31ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చినీ విక్కడనుండి బయలుదేరి పొమ్ము; హేరోదు నిన్ను చంప గోరుచున్నాడని ఆయనతో చెప్పగా
32ఆయన వారిని చూచిమీరు వెళ్లి, ఆ నక్కతో ఈలాగు చెప్పుడి ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ల గొట్టుచు (రోగులను) స్వస్థపరచుచునుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందెదను.
33అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను; ప్రవక్త యెరూషలేము నకు వెలుపల నశింప వల్లపడదు.
34యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, నీయొద్దకు పంప బడినవారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో ఆలాగే ఎన్నో మారులు నేను నీ ప్లిలలను చేర్చుకొనవలెనని యుంటినిగాని మీ రొల్లకపోతిరి.
35ఇదిగో మీ యిల్లు మీకు పాడుగా విడువబడుచున్నదిప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాకని మీరు చెప్పువరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాననెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి