ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారియందు కనికరము చూపునుగాక.
14నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మవలన కాపాడుము.
15ఆసియలోని వారందరు నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదువు; వారిలో ఫుగెల్లు హెర్మొగెనే అనువా రున్నారు.
16ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారియందు కనికరము చూపునుగాక.
17అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లనుగూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి, కనుగొని, అనేక పర్యాయములు ఆదరించెను.
18మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారముచేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువువలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించును గాక.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి