లేవీకాండము 21:6

వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైనవారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి అహారమును, అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు; కావున వారు పరిశుద్ధులై యుండవలెను.

సందర్భంతో చదవండి · లేవీకాండము 21

4అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచు కొని సామాన్యునిగా చేసికొనరాదు.

5వారు తమ తలలు బోడిచేసికొనరాదు. గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసికొన రాదు, కత్తితో దేహమును కోసికొనరాదు.

6వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైనవారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి అహారమును, అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు; కావున వారు పరిశుద్ధులై యుండవలెను.

7వారు జార స్త్రీనే గాని భ్రష్టురాలినేగాని పెండ్లిచేసికొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసికొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు.

8అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచ వలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావ లెను.

లేవీకాండము 21 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी