1 దినవృత్తాంతములు 28:8

కాబట్టి మీరు ఈ మంచిదేశమును స్వాస్థ్యముగా అనుభవించి, మీ తరువాత మీ సంతతివారికి శాశ్వత స్వాస్థ్యముగా దానిని అప్ప గించునట్లు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన యాజ్ఞలన్నియు ఎట్టివో తెలిసికొని వాటిని గైకొనుడి అని యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలీయులందరు చూచుచుండగను మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను.

సందర్భంతో చదవండి · 1 దినవృత్తాంతములు 28

6నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని యున్నాను, నేను అతనికి తండ్రినైయుందును అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును.

7మరియు నేటిదినమున చేయుచున్నట్లు అతడు ధైర్యమువహించి నా ఆజ్ఞలను నా న్యాయవిధులను అనుసరించినయెడల, నేనతని రాజ్యమును నిత్యము స్థిరపరచుదును.

8కాబట్టి మీరు ఈ మంచిదేశమును స్వాస్థ్యముగా అనుభవించి, మీ తరువాత మీ సంతతివారికి శాశ్వత స్వాస్థ్యముగా దానిని అప్ప గించునట్లు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన యాజ్ఞలన్నియు ఎట్టివో తెలిసికొని వాటిని గైకొనుడి అని యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలీయులందరు చూచుచుండగను మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను.

9​సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము,ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసి వేయును.

10పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము.

1 దినవృత్తాంతములు 28 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी