ద్వితియోపదేశకాండము 2:10

పూర్వకాలమున ఏమీయులనువారు ఆరు దేశములో నివసించిరి. వారు అనాకీయులవలె, ఉన్నత దేహులు, బలవంతులైన బహు జనులు. వారును అనాకీయులవలె రెఫాయీయులుగా ఎంచబడిన వారు.

సందర్భంతో చదవండి · ద్వితియోపదేశకాండము 2

8అప్పుడు శేయీరులో నివసించు ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి, ఏలతు ఎసోన్గెబెరు అరాబా మార్గమునుండి మనము ప్రయాణము చేసితివిు.

9మనము తిరిగి మోయాబు అరణ్యమార్గమున ప్రయా ణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెనుమోయాబీయులను బాధింపవద్దు; వారితో యుద్ధముచేయ వద్దు. లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్య ముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్య ముగా ఇయ్యను.

10పూర్వకాలమున ఏమీయులనువారు ఆరు దేశములో నివసించిరి. వారు అనాకీయులవలె, ఉన్నత దేహులు, బలవంతులైన బహు జనులు. వారును అనాకీయులవలె రెఫాయీయులుగా ఎంచబడిన వారు.

11​మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి.

12పూర్వకాలమున హోరీయులు శేయీరులో నివసించిరి. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏశావు సంతానపువారు హోరీయుల దేశమును స్వాధీన పరచుకొని తమ యెదుటనుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి.

ద్వితియోపదేశకాండము 2 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी