సంఖ్యాకాండము 27:9

వానికి కుమార్తె లేనియెడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇయ్యవలెను.

సందర్భంతో చదవండి · సంఖ్యాకాండము 27

7నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను.

8మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పవలెను ఒకడు కుమారుడు లేక మృతి బొందినయెడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను.

9వానికి కుమార్తె లేనియెడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇయ్యవలెను.

10వానికి అన్నదమ్ములు లేని యెడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్న దమ్ములకు ఇయ్యవలెను.

11వాని తండ్రికి అన్నదమ్ములు లేని యెడల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇయ్యవలెను; వాడు దాని స్వాధీనపరచు కొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీయులకు విధింపబడిన కట్టడ.

సంఖ్యాకాండము 27 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी