యిర్మియా 6:10

విందురని నేనెవరితో మాటలాడెదను? ఎవరికి సాక్ష్య మిచ్చెదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాని తృణీకరింతురు.

సందర్భంతో చదవండి · యిర్మియా 6

8​యెరూషలేమా, నేను నీయొద్దనుండి తొలగింపబడకుండునట్లును నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండునట్లును శిక్షకు లోబడుము.

9సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడుద్రాక్షచెట్టు ఫలమును ఏరుకొనునట్లు మను ష్యులు ఏమియు మిగులకుండ ఇశ్రాయేలు శేషమును ఏరు దురు; ద్రాక్షపండ్లను ఏరువాడు చిన్న తీగెలను ఏరుటకై తన చెయ్యి మరల వేయునట్లు నీ చెయ్యివేయుము.

10విందురని నేనెవరితో మాటలాడెదను? ఎవరికి సాక్ష్య మిచ్చెదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాని తృణీకరింతురు.

11కావున నేను యెహోవా క్రోధముతో నిండియున్నాను, దానిని అణచుకొని అణచుకొని నేను విసికియున్నాను, ఒకడు తప్పకుండ వీధిలోనున్న పసిపిల్లలమీదను ¸°వనుల గుంపుమీదను దాని కుమ్మరింపవలసి వచ్చెను, భార్యా భర్త లును వయస్సు మీరినవారును వృద్ధులును పట్టుకొనబడె దరు.

12ఏమియు మిగులకుండ వారి యిండ్లును వారి పొల ములును వారి భార్యలును ఇతరులకు అప్పగింపబడుదురు, ఈ దేశనివాసులమీద నేను నా చెయ్యి చాపుచున్నాను; ఇదే యెహోవా వాక్కు

యిర్మియా 6 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी