ఎస్తేరు 1:16

మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల యెదుటను ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెనురాణియైన వష్తి రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములలోనుండు అధిపతులందరి యెడలను జనులందరియెడలను నేరస్థురాలాయెను.

సందర్భంతో చదవండి · ఎస్తేరు 1

14అతడు కాలజ్ఞానులను చూచిరాణియైన వష్తి రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకులచేత ఇచ్చిన ఆజ్ఞప్రకారము చేయక పోయినందున ఆమెకు విధినిబట్టి చేయవలసినదేమని వారి నడిగెను.

15అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు, రాజ్యమందు ప్రథమపీఠముల మీద కూర్చుండు పారసీకులయొక్కయు మాదీయుల యొక్కయు ఏడుగురు ప్రధానులు ఎవరనగాకర్షెనా షెతారు అద్మాతా తర్షీషు మెరెను మర్సెనా మెమూకాను అనువారు.

16మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల యెదుటను ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెనురాణియైన వష్తి రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములలోనుండు అధిపతులందరి యెడలను జనులందరియెడలను నేరస్థురాలాయెను.

17ఏల యనగా రాజైన అహష్వేరోషు తన రాణియైన వష్తిని తన సన్నిధికి పిలుచుకొని రావలెనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరు దానివిని, ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు.

18మరియు పారసీకులయొక్కయు మాదీయుల యొక్కయు నాయకపత్నులు రాణి చేసినదాని సమా చారము విని, రాణి పలికినట్లు ఈ దినమందు రాజుయొక్క అధిపతులందరితో పలుకుదురు. దీనివలన బహు తిర స్కారమును కోపమును పుట్టును.

ఎస్తేరు 1 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी