యెషయా 30:6

దక్షిణ దేశములోనున్న క్రూరమృగములను గూర్చిన దేవోక్తి సింహీ సింహములును పాములును తాపకరమైన మిడునాగులు నున్న మిక్కిలి శ్రమ బాధలుగల దేశముగుండ వారు గాడిదపిల్లల వీపులమీద తమ ఆస్తిని ఒంటెల మూపులమీద తమ ద్రవ్యములను ఎక్కించు కొని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసికొని పోవుదురు.

సందర్భంతో చదవండి · యెషయా 30

4యాకోబువారి అధిపతులు సోయనులో కనబడునప్పుడు వారి రాయబారులు హానేసులో ప్రవేశించునప్పుడు

5వారందరును తమకు అక్కరకు రాక యే సహాయ మునకైనను ఏ ప్రయోజనమునకైనను పనికిరాక సిగ్గును నిందయు కలుగజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు.

6దక్షిణ దేశములోనున్న క్రూరమృగములను గూర్చిన దేవోక్తి సింహీ సింహములును పాములును తాపకరమైన మిడునాగులు నున్న మిక్కిలి శ్రమ బాధలుగల దేశముగుండ వారు గాడిదపిల్లల వీపులమీద తమ ఆస్తిని ఒంటెల మూపులమీద తమ ద్రవ్యములను ఎక్కించు కొని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసికొని పోవుదురు.

7ఐగుప్తువలని సహాయము పనికిమాలినది,నిష్ప్రయోజన మైనది అందుచేతనుఏమియు చేయక ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను.

8రాబోవు దినములలో చిరకాలమువరకు నిత్యము సాక్ష్యార్థముగా నుండునట్లు నీవు వెళ్లి వారియెదుట పలకమీద దీని వ్రాసి గ్రంథ ములో లిఖింపుము

యెషయా 30 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी