పరమగీతము 6:10

సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందముగలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలునుగలదై వ్యూహితసైన్య సమభీకర రూపిణియునగు ఈమె ఎవరు?

సందర్భంతో చదవండి · పరమగీతము 6

8అరువదిమంది రాణులును ఎనుబదిమంది ఉపపత్ను లును లెక్కకు మించిన కన్యకలును కలరు.

9నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె కన్నతల్లికి ముద్దు బిడ్డ స్త్రీలు దాని చూచి ధన్యురాలందురు రాణులును ఉపపత్నులును దాని పొగడుదురు.

10సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందముగలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలునుగలదై వ్యూహితసైన్య సమభీకర రూపిణియునగు ఈమె ఎవరు?

11లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షావల్లులు చిగిర్చెనో లేదో దాడిమవృక్షములు పూతపట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్లితిని.

12తెలియకయే నా జనులలో ఘనులగువారి రథములను నేను కలిసికొంటిని.

పరమగీతము 6 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी