లేవీకాండము 26:41

​​నేను తమకు విరోధముగా నడి చితిననియు, తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పిం చితిననియు, ఒప్పు కొనినయెడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతి దండనను అనుభవించితిమని ఒప్పుకొనినయెడల,

సందర్భంతో చదవండి · లేవీకాండము 26

39​మీలో మిగిలినవారు మీ శత్రు వుల దేశములలో తమ దోషములనుబట్టి క్షీణించిపోయెదరు. మరియు వారు తమమీదికి వచ్చిన తమ తండ్రుల దోషములనుబట్టి క్షీణించిపోయెదరు.

40​వారు నాకు విరో ధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని, తాము నాకు విరోధముగా నడిచితిమనియు

41​​నేను తమకు విరోధముగా నడి చితిననియు, తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పిం చితిననియు, ఒప్పు కొనినయెడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతి దండనను అనుభవించితిమని ఒప్పుకొనినయెడల,

42​నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసి కొందును; నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసి కొందును; ఆ దేశమునుకూడ జ్ఞాపకము చేసికొందును.

43​వారిచేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతిదినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహ్యించు కొనిరి. ఆ హేతువుచేతనే వారు తమ దోషశిక్ష న్యాయ మని ఒప్పుకొందురు.

లేవీకాండము 26 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी