1 రాజులు 21:16

నాబోతు చనిపోయెనని అహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోటను స్వాధీన పరచుకొనబోయెను.

సందర్భంతో చదవండి · 1 రాజులు 21

14నాబోతు రాతిదెబ్బలచేత మరణమాయెనని వారు యెజె బెలునకు వర్తమానము పంపగా

15నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయెనని యెజెబెలు వినినాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయెను గనుక నీవు లేచి యెజ్రె యేలీయుడైన నాబోతు క్రయమునకు నీకియ్యనొల్లక పోయిన అతని ద్రాక్షతోటను స్వాధీనపరచుకొనుమని అహాబుతో చెప్పెను.

16నాబోతు చనిపోయెనని అహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోటను స్వాధీన పరచుకొనబోయెను.

17అప్పుడు యెహోవావాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

18నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలురాజైన అహాబును ఎదు ర్కొనుటకు బయలుదేరుము, అతడు నాబోతుయొక్క ద్రాక్షతోటలో ఉన్నాడు; అతడు దానిని స్వాధీనపరచు కొనబోయెను.

1 రాజులు 21 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी