వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతియైన హల్లోహెషు కుమారుడైన షల్లూ మును ఆతని కుమార్తెలును బాగుచేసిరి.
10వారిని ఆనుకొని తన యింటికి ఎదురుగా హరూమపు కమారుడైన యెదాయా బాగుచేసెను, అతని ఆనుకొని హషబ్నెయా కుమారుడైన హట్టూషు పని జరుపువాడై యుండెను.
11రెండవ భాగమును అగ్నిగుండముల గోపురమును హారిము కుమారుడైన మల్కీయాయును పహత్మోయాబు కుమారుడైన హష్షూ బును బాగుచేసిరి.
12వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతియైన హల్లోహెషు కుమారుడైన షల్లూ మును ఆతని కుమార్తెలును బాగుచేసిరి.
13లోయద్వారమును హానూనును జానోహ కాపురస్థులును బాగుచేసి కట్టినతరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంటద్వారమువరకుండు గోడ వెయ్యిమూరల దనుక వారుకట్టిరి.
14బేత్‌హక్కెరెము ప్రదేశమునకు అధిపతియైన రేకాబు కుమారుడైన మల్కీయా పెంటగుమ్మ మును బాగు చేసెను, ఆతడు దాని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి