యెషయా 30:24

భూమి సేద్యముచేయు ఎడ్లును లేత గాడిదలును చేట తోను జల్లెడతోను చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును.

సందర్భంతో చదవండి · యెషయా 30

22చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరతురు హేయములని వాటిని పారవేయుదురు. లేచిపొమ్మని దానితో చెప్పుదురు.

23నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును భూమి రాబడియైన ఆహారద్రవ్యమిచ్చును అది విస్తార సార రసములు కలదై యుండును ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డిబీళ్లలో మేయును.

24భూమి సేద్యముచేయు ఎడ్లును లేత గాడిదలును చేట తోను జల్లెడతోను చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును.

25గోపురములు పడు మహా హత్యదినమున ఉన్నతమైన ప్రతి పర్వతముమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను వాగులును నదులును పారును.

26యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశమువలె ఉండును సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును.

యెషయా 30 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी