లేవీకాండము 20:4

మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మోలెకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక,

సందర్భంతో చదవండి · లేవీకాండము 20

2ఇశ్రా యేలీయులలోనేగాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనేగాని యొకడు ఏమాత్రమును తన సంతాన మును మోలెకుకు ఇచ్చినయెడల వానికి మరణ శిక్ష విధింప వలెను; మీ దేశప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను.

3ఆ మనుష్యుడు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధనామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజ లలోనుండి వాని కొట్టివేతును.

4మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మోలెకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక,

5చూచి చూడనట్లు తమ కన్నులు మూసికొనినయెడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మోలెకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారముచేయు వారినందరిని ప్రజలలోనుండి కొట్టివేతును.

6​మరియు కర్ణపిశాచి గలవారితోను సోదె గాండ్ర తోను వ్యభిచరించుటకు వారితట్టు తిరుగువా డెవడో నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టి వేతును.

లేవీకాండము 20 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी