యెహేజ్కేలు 36:7

​​ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగామీ చుట్టునున్న అన్య జనులు అవమానము నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను.

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 36

5ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాసంతుష్టహృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాని స్వాధీనపరచు కొనిన ఎదోమీయులనందరిని బట్టియు, శేషించిన అన్య జనులనుబట్టియు నారోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చియున్నాను.

6​కాబట్టి ఇశ్రాయేలు దేశమునుగూర్చి ప్రవచనమెత్తి, పర్వతములతోను కొండలతోను వాగుల తోను లోయలతోను ఈ మాట తెలియజెప్పుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగామీరు అన్య జనులవలన అవమానము నొందితిరి గనుక రోషముతోను కోపముతోను నేను మాట ఇచ్చియున్నాను.

7​​ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగామీ చుట్టునున్న అన్య జనులు అవమానము నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను.

8ఇశ్రాయేలు పర్వతములారా, యిక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులగు నా జనులు వచ్చె దరు, మీరు చిగురుపెట్టి వారికొరకు మీ ఫలములు ఫలించుదురు.

9నేను మీ పక్షముననున్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు.

యెహేజ్కేలు 36 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी