లూకా 8:25

అప్పుడాయన మీ విశ్వాసమెక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడిఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే; ఈయన యెవరో అని యొకనితో నొకడు చెప్పుకొని ఆశ్చర్యపడి

సందర్భంతో చదవండి · లూకా 8

23వారు వెళ్లు చుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సుమీదికి వచ్చి దోనె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి

24గనుక ఆయనయొద్దకు వచ్చిప్రభువా ప్రభువా, నశించిపోవుచున్నా మని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి, గాలిని నీటిపొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమా యెను.

25అప్పుడాయన మీ విశ్వాసమెక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడిఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే; ఈయన యెవరో అని యొకనితో నొకడు చెప్పుకొని ఆశ్చర్యపడి

26వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసీనీయుల దేశమునకు వచ్చిరి.

27ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగావచ్చెను. వాడు దయ్యములుపట్టినవాడై, బహుకాలమునుండి బట్టలు కట్టు కొనక, సమాధులలోనేగాని యింటిలో ఉండువాడు కాడు.

లూకా 8 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी