యెహేజ్కేలు 8:3

​మరియు చెయ్యివంటిది ఒకటి ఆయన చాపి నా తలవెండ్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమ్యాకాశముల మధ్యకు నన్నెత్తి, నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూష లేమునకు ఉత్తరపువైపుననున్న ఆవరణ ద్వారముదగ్గర రోషము పుట్టించు విగ్రహస్థానములో నన్ను దించెను.

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 8

1ఆరవ సంవత్సరము ఆరవ నెల అయిదవ దినమున నేను నా యింట కూర్చునియుండగాను యూదా పెద్దలు నా యెదుట కూర్చుండియుండగాను ప్రభువైన యెహోవా హస్తము నామీదికి వచ్చెను.

2అంతట నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను, నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజియైనట్టుగాను ఆయన నాకు కనబడెను.

3​మరియు చెయ్యివంటిది ఒకటి ఆయన చాపి నా తలవెండ్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమ్యాకాశముల మధ్యకు నన్నెత్తి, నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూష లేమునకు ఉత్తరపువైపుననున్న ఆవరణ ద్వారముదగ్గర రోషము పుట్టించు విగ్రహస్థానములో నన్ను దించెను.

4అంతట లోయలో నాకు కనబడిన దర్శనరూపముగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము అచ్చట కనబడెను.

5నర పుత్రుడా, ఉత్తరపువైపు తేరి చూడుమని యెహోవా నాకు సెలవియ్యగా నేను ఉత్తరపువైపు తేరి చూచితిని; ఉత్తరపువైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను.

యెహేజ్కేలు 8 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी