నెహెమ్యా 12:43

మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసెనని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలుకూడ సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహు దూరమునకు వినబడెను.

సందర్భంతో చదవండి · నెహెమ్యా 12

41యాజకులగు ఎల్యా కీము మయశేయా మిన్యామీను మీకాయా ఎల్యోయేనై జెకర్యా హనన్యా బాకాలు పట్టుకొనిరి.

42ఇజ్రహయా అనువాడు నడిపింపగా మయశేయా షెమయా ఎలియాజరు ఉజ్జీ యెహోహానాను మల్కీయా ఏలాము ఏజెరులను గాయకులు బిగ్గరగా పాడిరి.

43మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసెనని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలుకూడ సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహు దూరమునకు వినబడెను.

44ఆ కాలమందు పదార్థములకును ప్రతిష్ఠార్పణలకును ప్రథమ ఫలములకును పదియవవంతుల సంబంధమైన వాటికిని ఏర్పడిన గదులమీద కొందరు నియమింపబడిరి, వారు యాజకుల కొరకును లేవీయులకొరకును ధర్మశాస్త్రాను సారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలములనుండి సమకూర్చుటకు నియమింపబడిరి; సేవ చేయుటకు నియమింపబడిన యాజకులనుబట్టియు, లేవీయు లనుబట్టియు యూదులు సంతోషించిరి.

45మరియు గాయ కులును ద్వారపాలకులును దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లు దేవునిగూర్చిన పనులను తమ శుద్ధినిగూర్చిన పనులను నెరవేర్చుచు వచ్చిరి.

నెహెమ్యా 12 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी