ఏడంతలు ప్రతి దండన కయీను కోసము, వచ్చిన యెడల లెమెకు కోసము డెబ్బది యేడంతలు వచ్చుననెను.
22మరియు సిల్లా తూబల్కయీనును కనెను. అతడు పదునుగల రాగి పని ముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు. తూబల్కయీను సహోదరి పేరు నయమా.
23లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా, నా పలుకు వినుడి లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి నన్ను గాయపరచినందుకై ఒక మనుష్యుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని
24ఏడంతలు ప్రతి దండన కయీను కోసము, వచ్చిన యెడల లెమెకు కోసము డెబ్బది యేడంతలు వచ్చుననెను.
25ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కనికయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెనను కొని అతనికి షేతు అను పేరు పెట్టెను.
26మరియు షేతునకుకూడ కుమారుడు పుట్టెను; అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి