1 సమూయేలు 30:19

కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తికొనిపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి యేదియు తక్కువకాకుండ దావీదు సమస్తమును రక్షించెను.

సందర్భంతో చదవండి · 1 సమూయేలు 30

17దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రమువరకు వారిని హతము చేయుచుండగా, ఒంటెలమీద ఎక్కిపారి పోయిన నాలుగువందల మంది ¸°వనులు తప్ప తప్పించుకొనినవాడు ఒకడును లేకపోయెను.

18​ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన యిద్దరు భార్యలను రక్షించెను.

19కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తికొనిపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి యేదియు తక్కువకాకుండ దావీదు సమస్తమును రక్షించెను.

20మరియు దావీదు అమాలేకీయుల గొఱ్ఱలన్నిటిని గొడ్లన్నిటిని పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి.

21అలసటచేత దావీ దును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన ఆ రెండువందల మందియొద్దకు దావీదు పోగా వారు దావీ దును అతనియొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలు దేరి వచ్చిరి. దావీదు ఈ జనులయొద్దకు వచ్చి వారి యోగక్షేమమడుగగా

1 సమూయేలు 30 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी