యెహేజ్కేలు 41:5

తరువాత అతడు మందిరపు గోడను కొలువగా ఆరు మూరలాయెను, మందిరపు ప్రక్కలనున్న మేడ గదులను కొలువగా నాలుగేసి మూరలాయెను.

సందర్భంతో చదవండి · యెహేజ్కేలు 41

3అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలువగా రెండు మూరలాయెను, వాకిలి ఆరుమూరలు;వెడల్పు ఏడు మూరలు.

4ఇది అతి పరిశుద్ధస్థలమని చెప్పి దాని నిడివిని కొలువగా ఇరువది మూరలును ఆలయమునకును దానికిని మధ్య వెడల్పు ఇరువది మూరలు నాయెను.

5తరువాత అతడు మందిరపు గోడను కొలువగా ఆరు మూరలాయెను, మందిరపు ప్రక్కలనున్న మేడ గదులను కొలువగా నాలుగేసి మూరలాయెను.

6ఈ మేడగదులు మూడేసి అంతస్థులు గలవి. ఈలాగున ముప్పది గదులుండెను, ఇవి మేడ గదులచోటున మందిరమునకు చుట్టు కట్టబడిన గోడతో కలిసియుండెను; ఇవి మందిరపుగోడను ఆనుకొనియున్న ట్టుండి ఆనుకొనక యుండెను.

7ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగెను, పైకెక్కిన కొలది మందిరముచుట్టునున్న యీ మేడగదుల అంతస్థులు మరి వెడల్పగుచుండెను గనుక మందిరపు పైభాగము మరి వెడల్పుగా ఉండెను; పైకెక్కిన కొలది అంతస్థులు మరి వెడల్పుగా ఉండెను.

యెహేజ్కేలు 41 మొత్తం చదవండి

ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి

KJV தமிழ் ಕನ್ನಡ हिन्दी