అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడుప్రభువా ఇట్టి నీతిగల జన మును హతము చేయుదువా?
2అప్పుడు అబ్రాహాము తన భార్యయైన శారానుగూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన యింట చేర్చుకొనెను.
3అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చినీవు నీ యింట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పెను.
4అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడుప్రభువా ఇట్టి నీతిగల జన మును హతము చేయుదువా?
5ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడ అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యధార్థ హృదయముతో ఈ పని చేసితిననెను.
6అందుకు దేవుడు అవును, యధార్థహృదయముతో దీని చేసితివని నేనెరుగుదును; మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండ నేను నిన్ను అడ్డగించితిని; అందుకే నేను నిన్ను ఆ
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి